హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకరమని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.
బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంబర్‌పేటలో జరిగిన ఘటనలో బాలుడి మృతి తనను ఎంతో కలచివేసిందని చెప్పారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని.. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు.
కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ అంబర్‌పేటలోని ఛే నంబర్ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది.
జంతువులను వేటాడినట్టుగా కుక్కలన్నీ ఆ చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడిచేయడంతో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి ప్రాణాలు కోల్పోయాడు