జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఓ యువ పోలీసు తుది శ్వాస విడిచాడు. జిమ్ మధ్యలో తీవ్రమైన దగ్గు వచ్చి కుప్పకూలిపోయాడు . జిమ్‌లోని వ్యక్తులు అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు, అప్పటికే ఆలస్యం కావడంతో అతను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే, 24 ఏళ్ల వయసున్న విశాల్ అనే పోలీస్ కానిస్టేబుల్ హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. తన దినచర్యను అనుసరించి జిమ్‌కి వెళ్లి కొన్ని వర్కవుట్లు చేశాడు. దగ్గు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దురదృష్టవశాత్తు ఆ యువకుడు చనిపోయాడు.
ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యువకుడు మరణించాడన్న విషాద వార్తను అతని కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. 24 ఏళ్ల వయసున్న విశాల్ ఇక లేరన్న కఠోర సత్యాన్ని వారు ఇంకా అంగీకరించలేకపోతున్నారు.