ఆరాంఘర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి చెందిన రాజశేఖర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ గుండెపోటుతో పడిపోయిన ఒక వ్యక్తికీ CPR ఇచ్చి ప్రాణాలు కాపాడాడు.
విరాల్లోకి వెళితే, బాలరాజు అనే వ్యక్తికి గుండెపోటుతో ఆరాంఘర్ చౌరస్తాలో పడిపోగా అక్కడే డ్యూటీ చేస్తున్న రాజశేఖర్ అనే కానిస్టేబుల్ అతనికి CPR ఇచ్చాడు కాసేపటికి గుండెపోటుతో పడిపోయిన వ్యక్తి ఊపిరి పీల్చుకోవడంతో దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించినట్టుగా సమాచారం.
ట్రాఫిక్ పోలీస్ చేసే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఎండ, వాన, దుమ్ము, ధూళి అనక రోజంతా రోడ్ పై నిలబడి ప్రజలు ప్రమాదంలో పడకుండా వాహనాలను అదుపు చేస్తూ వారి విధి నిర్వహణలు నిర్వస్తిస్తుంటారు. ఇలా ప్రజల ప్రాణాలు కాపాడుతున్న ఫ్రెండ్లీ పోలీస్‌కు ప్రజలందరి తరపున సెల్యూట్.