నందిగామ కొత్తూరు మధ్యలో
బెంగళూరు హైదరాబాద్ హైవేపై వనపర్తి ఆర్టిసి బస్సు కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది .
ఈ ప్రమాదంలో కొంత మందికి గాయాలు కాగా మరి కొంత మందికి ఫ్రాక్చర్స్ ఐనట్టుగా అక్కడివారు సమాచారం . ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గురైన బస్సు నెంబర్ టీఎస్ 32 టి 4736 .

పూర్తి వివరాల్లోకి వెళితే నందిగామ కొత్తూరు మధ్యలో నేషనల్ హైవే పై ముందు వెళ్తున్న డీసీఎం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వనపర్తి డిపోకు చెందిన ఆర్టీసీ టిఎస్ 32 టి4736 నెంబర్ గల బస్సు డీసీఎంను వెనుక నుంచి ఢీకొట్టడం జరిగింది ఈ ప్రమాదంలో కొంత మందికి తీవ్ర గాయాలు అయినవి వారిని వెంటనే అంబులెన్స్లో దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు