మహబూబ్నగర్ జిల్లా, నవాపేట మండలం, గురుకుంటా గ్రామం.
పెట్టుబడులు పెట్టి 6 నెలలు చెమటోర్చి కస్టపడిన లాభం దక్కుతుందో లేదో చెప్పలేము. అది చాలదన్నట్టు గురుకుంట గ్రామం లోని బంటు పెద్ద శ్రీనివాసులు s/o బంటు నారాయణ, అనే రైతుని గుర్తు తెలియని వ్యక్తి కొన్ని నెలలుగా ఆవేదనకు గురిచేస్తున్నాడు.
శ్రీనివాసులు చెప్పిన వివరాల ప్రకారం, ఎవరు చూడని సమయంలో తాను పండిస్తున్న పంటలను నాశనం చేయడం, వర్షానికీ తడవకుండా జాగ్రత్త కోసం కప్పిన కవర్ ని చింపి వేయడం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంటు కట్ చేయడం. ఇలాంటి పనులు ఒకటి రోజు కాదు రెండు రోజులు కాదు, రెండు సంవత్సరాలుగా అతన్ని వేధిస్తున్నాయి.
గతంలో వేసిన పంటను, ఆ శాడిస్ట్ అంతుతెలియని రసాయనాన్ని పంటలో చల్లగా సగం మేరకు పంట నాశనం కావడంతో ఏం చేయాలో పాలుపోక, పంట నష్టం కోసం అగ్రరికల్చర్ అధికారులను సంప్రదించారు. అందుకు వారు ఆ పంట నష్టానికి నస్టపరిహారం చెల్లించలేమని తేల్చిచెప్పడంతో చేసేది ఏమి లేక KCR రైతుబంధు పథకం ద్వారా వచ్చిన డబ్బుతో అతను ఇంకో పంట ప్రస్తుతం పండిస్తున్నాడు. కానీ ఆ శాడిస్ట్ వాడి ఆగడాలను మాత్రం ఆపట్లేదు.
చుట్టూ కొండల మధ్య అడవిలా ఉన్న అతని పొలంలో ఆ శాడిస్ట్ ని ఎలా పట్టుకోవాలో తెలియక, ఎవరిమీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలో తెలియక ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అర్థం కాక ఆ రైతు ఆవేదనకు గురవుతున్నాడు
దీనికి పరిస్కారాన్ని కింద కామెంట్స్ బాక్స్ లో తెలియచేయండి.