ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ Baby ఈ జులై 14 న విడుదల కాబోతుందన్న విషయం అందరికి తెలిసిందే అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అందరం థియేటర్ కి వెళ్లి చూద్దాం. కానీ.. దానికి ముందు మనకంటూ కొన్ని అంచనాలు ఉంటాయి కదా..
ఆనంద్ దేవరకొండ మొదటి రెండు సినిమాలు ప్రేక్షకులను పెద్దగా సంతృప్తి పరచలేదు. ఆ తరువాత 2020 లో వచ్చిన Middle Class Melodies OTT లో మంచి హిట్ కొట్టింది. ఇటు మన హీరో కి మరియు ప్రేక్షకులకు కొంత వరకు ఊరటనిచ్చింది అనే చెప్పుకోవాలి. ఆ తరువాత విదులైన పుష్పక విమానం కూడా ప్రేక్షకులను అందులోకి లాగేసింది.
ఇది ఇలా ఉండగా, 2023 లో కొత్త తరహా లవ్ స్టోరీ తో ముందుకు రాబోతున్న బేబీ మూవీ ఎలా ఉండబోతోంది అనే విషయానికి వస్తే..
ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఒక సాదా సీదా ఆటో డ్రైవర్ గా తెర మీద్దకి రానున్నాడు. మన హీరో లవ్ ఫెయిల్యూర్ ఐన అబ్బాయి లా ట్రైలర్ లో మనకు దర్శనమిస్తాడు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా మరియు మన హీరో లవర్ గా ట్రైలర్ లో మనకు కనిపిస్తుంది.
హీరో 10th ఫెయిల్ అని ట్రైలర్ లో మనకు తెలుస్తుంది. మరియు హీరోయిన్ 10th పాస్ ఐన తరువాత కాలేజీ లో జాయిన్ అవుతుంది. ఆ తరువాత హీరోయిన్ మన హీరో ని మర్చిపోతుందా..! కాలేజ్ లో చేరిన తరువాత కొత్త దోస్తులు మన హీరో ని మర్చిపోయేలా చేస్తారా.. అసలు వాళ్లిదరిమద్య ఏం జరుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఇక ట్రైలర్ విషయానికొస్తే This is Vaishnavi calling from original phone అనే funny డైలాగ్ మరియు ” తిరిగి కొంటెంత బలం లేదనే కదరా మీకు ఈ కొవ్వు.. మీ అంత బలం లేకుండొచ్చు కానీ గుండెలమీద కొట్టాలంటే మాకంటే గట్టిగ ఇంకెవ్వడు కొట్టలేడు” అనే సెంటిమెంట్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ ట్రైలర్ కి హైలైట్స్ గ ఉంటాయి.
ఇక మ్యూజిక్ అంటారా.. మెలోడీస్ ముందుగానే యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్నాయి. వాటి గురించి చెప్పడం కంటే వింటేనే బాగుంటుంది. విజయ్ బుల్గనిన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి. ” ఓ రెండు ప్రేమ మేఘాలిలా ” అనే సాంగ్ హైలైట్ గా ఉండబోతుంది అని అంచనా..
ఇక ఈ సినిమా రేటింగ్ విషయానికి వస్తే.. Baby కి కచ్చితంగా 9+/10 రేటింగ్ ఉంటుందని newshat.net గట్టిగ నమ్ముతోంది. అంతే కాదు ఆనంద్ దేవరకొండ బెస్ట్ మూవీస్ లో ఇది కూడా ఒకటిగా ఉండబోతుంది అనేది newshat అంచనా.
మరి ఏం జరుగుతుంది అనేది జులై 14 రోజు చూద్దాం..
Note: If you observe any mistakes in the content, please forgive me. and if you like our content, try to share our website with your friends.