పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న లెజెండరీ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గాయపడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ పాన్-ఇండియన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ సందర్భంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఇది జరిగింది. ఈ అప్‌డేట్‌ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారు తన అధికారిక బ్లాగ్ ద్వారా వెల్లడించారు.
అమితాబ్ బచ్చన్ గారి మాటల్లో: హైదరాబాదులో ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో యాక్షన్ షాట్‌లో నాకు గాయమైంది. హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌కి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చాను.. పట్టీలు కట్టిన తర్వాత విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది.. అవును బాధాకరంగా ఉంది.. కదలికలు మరియు శ్వాస తీసుకోవడంలో.. కొన్ని వారాలు పడుతుందని డాక్టర్స్ అంటున్నారు, కొంత సాధారణీకరణ జరగడానికి.. నొప్పులు తగ్గడానికి కొన్ని మందులు కూడా ఉన్నాయి ..”
అతను ఇంకా ఇలా అన్నాడు, ” చేయవలసిన అన్ని పనులు నిలిపివేయబడ్డాయి మరియు వైద్యం జరిగే వరకు రద్దు చేయబడ్డాయి. నేను ఈ సాయంత్రం జల్సా గేట్ వద్ద శ్రేయోభిలాషులను కలవలేను .. కాబట్టి రావద్దు .. మరియు వచ్చే ఉద్దేశ్యం ఉన్న వారికి వీలైనంత సమాచారం ఇవ్వండి . .మిగతా అంతా బాగానే ఉంది.
“మహానటుడు చాలా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము”
ఇటీవలే చిత్ర నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ దాదాపు 70% షూటింగ్ పూర్తయిందని, అయితే గ్రాఫిక్స్‌తో కూడిన సినిమా కాబట్టి చాలా సమయం కావాలని అన్నారు. టైమ్ ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్‌తో రూపొందిన సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని 2024 జనవరి 12న విడుదల చేయనున్నట్లు సమాచారం.